ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నబి రసూల్
విశాలాంధ్ర -ధర్మవరం ; ఈనెల 27వ తేదీన రిటైర్డ్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగి హరి మోహన్ సిసిఎస్ సొంత భవనం నిర్మించే విషయమై వారు పత్రికా ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, రిటైర్డ్ అయిన తర్వాత తమరు యూనియన్ విషయాలలో తలదూర్చితే సహించేది లేదని ఎబ్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నబి రసూల్, శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగార్జున్ రెడ్డి జివైపి రావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోక హరిమోహన్ రిటైర్డ్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగి విజయవాడలో సిసిఎస్ సొంత భవనం నిర్మించే విషయమై అతను ఇచ్చిన పత్రిక ప్రకటనపైన ఖండిస్తూ వాస్తవాలను తెలియచేశారు అని తెలిపారు.ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుడిగా చెప్పుకుంటూ కార్మికులకు సేవ చేస్తున్నా అని చెప్పుకుంటున్న మోక హరి మోహన్ ప్రస్తుతం పదవి విరమణ పొంది ఉన్నారు అన్న విషయం మర్చిపోయారా అని తెలిపారు.
రిటైర్ అయిన తర్వాత కూడా తమరు యూనియన్ విషయాలలో తల దూర్చి వాటి మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అసోసియేషన్ లో కలిసి మెలిసి ఉన్న అన్ని యూనియన్ సభ్యుల మధ్య కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేసి, పనిచేస్తున్నారే తప్ప తమరేమీ కార్మిక సేవ చేయడం లేదని గుర్తించుకోవాలి అని తెలిపారు.
డబ్బులు తీసుకుని పనిచేయడాన్ని సేవ అనరు అనే విషయం సిసియస్ సీనియర్ నాయకుడిగా 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం వున్న మీకు తెలియదా? అని తెలిపారు.
25 సంవత్సరాలు సిసిఎస్ డెలిగేటుగా సీనియర్ నాయకుడిగా కార్మికులకు సేవలు అందించానని అన్నారు. అంత అపారమైన అనుభవం ఉన్న తమరిని మీ యూనియన్ అప్పట్లో ఎం.సి మెంబర్ గా ఎందుకు తీసుకోలేదు ఒకసారి ఆలోచించండి తెలపండి అని తెలిపారు.
తమ గత చరిత్ర తెలిసిన ఎవరు మిమ్మల్ని కీలకమైన పదవుల్లో తీసుకోరు అని స్పష్టం చేశారు.మీరు మీ వ్యాపారం కోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులను పొగుడుతూ మీ పబ్బం గడుపుకుంటున్నారు అని తెలిపారు. మీరు ఎంప్లాయిస్ యూనియన్ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది అని తెలిపారు.
ఇక సిసిఎస్ పాలకమండలి గురించి కానీ ప్రస్తుతం సిసిఎస్ కు సొంత భవనం నిర్మించే విషయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని అన్నారు. ప్రస్తుతం మీరు ఆర్టీసీ ఉద్యోగి కాదు, సిసిఎస్ లో మెంబర్ కాదు, డెలిగేటు కాదు,
ఆ విషయాలు మేజర్ అసోసియేషన్ అయిన ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ లు అక్కడ ఉన్న పాలక మండలి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాయి అని స్పష్టం చేశారు.
తమరు సొంత భవనం గురించి వాస్తవాలు తెలుసుకోకుండా పత్రికలకు ఎక్కడం సమంజసం కాదు అని హితవు పలికారు.
మీకు అపారమైన తెలివితేటలు ఉండవచ్చు కానీ వాటిని మేము గౌరవిస్తాం అని,
తమరు మీ తెలివి తేటలను వక్రమార్గంలో ఉపయోగించి, కార్మికులను తప్పుదోవ పట్టించి, అసోసియేషన్ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉపయోగించ వద్దండి అని తెలిపారు.ప్రస్తుతం హెడ్ ఆఫీస్ లో సిసిఎస్ ఆఫీసును ఖాళీ చేయమని ఎవరు ఆదేశాలు ఇవ్వకపోయినా ఉచితంగా వస్తున్న సౌలభ్యాన్ని కాదని, కార్మికుల సొమ్మును ఖర్చు పెట్టడం అది కూడా సిసిఎస్ సభ్యులకు అనుకూలంగా లేని ప్రాంతంలో అపార్ట్మెంట్లో తీసుకోవడం ఏ మేరకు సబబు? వారు ప్రశ్నించారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సిసిఎస్ కు భవనం నిర్మించుకోవడానికి ఎంప్లాయిస్ యూనియన్ కు సంబంధించిన సొంత భూమిని సిసిఎస్ కు వితరణ చేయడం జరిగింది అని గుర్తు చేశారు.ఆ భూమికి సంబంధించి వాటాగా వచ్చిన డబ్బు ఎంప్లాయిస్ యూనియన్ పుణ్యమేనని అని మీకు తెలియదా అని వారు గుర్తు చేశారు.
సొమ్మొకడిది సోకొకడిది అనే చందంగా మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టిస్తున్నట్లు బేరాలు పలకడం కరెక్ట్ కాదు అని,
ఇండిపెండెంట్ గా సొంత భవనం కాకుండా అపార్ట్మెంట్ ను అందునా ఐదవ అంతస్తులో హెడ్ ఆఫీస్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో తీసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం అనివర్ ప్రశ్నించారు. సదరు బిల్డింగ్ కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండేది కాదు,
కొన్ని తరాలు మన్నవలసి ఉన్నది అని తెలిపారు.
అపార్ట్మెంట్ విలువ రోజురోజుకు పడిపోతుంది అని, అపార్ట్మెంట్ కు ల్యాండ్ షేర్ ఎంత వస్తుంది అని, భవిష్యత్తులో అపార్ట్మెంట్స్ శిథిలమైతే మరలా స్థలం కోసం వెతకాలా? అని వారి ప్రశ్నించారు.
మన స్వార్థం కోసం చూసుకుంటే భవిష్యత్ తరాల మాటేమిటి ఆలోచించాలి అని హితో పలికారు.
కాబట్టి తమరు తమకు సంబంధం లేని విషయాలను వదిలిపెట్టి మీ వ్యాపారం ఏదో మీరు చూసుకుంటే మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంల వర్కింగ్ ప్రెసిడెంట్, యన్.యన్.స్వామి, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.ఎస్.రెడ్డి, జిల్లా కార్యదర్శి జి.వై.పి.రావు, కోశాధికారి రమణప్ప రీజినల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రిటైర్ అయిన తర్వాత యూనియన్ విషయాల్లో తల దురిస్తే సహించేది లేదు..
RELATED ARTICLES