విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా) : పట్టణంలోని సంజీవ్ నగర్ రెండవ రోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం జనసేన పార్టీ రాయలసీమ ఎలక్షన్ జోన్ మెంబర్ ఆటో ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా జనసేన పార్టీ రాయలసీమ ఎలక్షన్ జోన్ మెంబర్ ఆటో ప్రసాద్ జనసేన పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విసిరేసిన విత్తనాలే మొలకెత్తి, మహావృక్షాలై జ్వలిస్తుంటే, విలువ లేని విమర్శలు తూటాలై తగులుతుంటే, పోరాటపు పవనమై పాతాళం చూపించి విజయోత్సవమై జనసేన పార్టీ జయకేతనం ఎగురవేశామన్నారు. ప్రతి జన సైనికుడు కృషి జనసేన పార్టీ విజయం అన్నారు. అనంతరం జనసేన పార్టీ సమీపంలో ఉన్న స్కూల్ విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు అల్తాఫ్, కాశి విశ్వనాధ్, సోము, షేక్ కరీం, సాధక్, సాదిక్ మహమ్మద్ జనసైనికులు పాల్గొన్నారు.