2024 అక్టోబర్ నాటికి ఆ దేశ జనాభా 120.3 మిలియన్లకు పడిపోయిన వైనం
2023తో పోలిస్తే రికార్డు స్థాయిలో 8.98 లక్షల మేర తగ్గిన జనాభా
ప్రపంచంలోనే జపాన్‌లో అత్యల్ప బర్త్ రేట్ నమోదు
జపాన్‌లో సోమవారం వెలువడిన అధికారిక డేటా ప్రకారం 2024 అక్టోబర్ నాటికి ఆ దేశ జనాభా 120.3 మిలియన్లకు పడిపోయింది. 2023తో పోలిస్తే రికార్డు స్థాయిలో 8.98 లక్షల జనాభా తగ్గింది.1950లో ప్రభుత్వం పోల్చదగిన డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇది రికార్డు స్థాయిలో అతిపెద్ద పతనం అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు జననాల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయినా జపాన్ యువత వివిధ కారణాలతో పెళ్లి, పిల్లల విషయంలో ఆలస్యం చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే జపాన్ అత్యల్ప బర్త్ రేట్‌ను నమోదు చేసింది. పిల్లలు కావాలని కోరుకునే యువ కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చీఫ్ క్యాబినెట్ కార్యదర్శి యోషిమాసా హయాషి అన్నారు. అటు జపాన్‌లో విదేశీయులు కూడా భారీగానే తగ్గుతున్నారు. జపాన్ యువ విదేశీయులను తమ శ్రమ వనరుగా మార్చుకుంది. కానీ ప్రభుత్వం కఠినమైన వలస విధానాన్ని కొనసాగించింది. ప్రస్తుతం విదేశీ కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే అనుమతిస్తోంది. దీంతో ఆ దేశంలో విదేశీయుల జనాభా కూడా గణనీయంగా తగ్గినట్లు తాజాగా వెలువడిన డేటాలో తేలింది.
జపాన్‌లో రికార్డు స్థాయిలో తగ్గిన జనాభా!
RELATED ARTICLES