Thursday, December 12, 2024
Homeజిల్లాలుఅనంతపురంరాయదుర్గం లో జరుగు ఏఐవైఎఫ్ 20వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

రాయదుర్గం లో జరుగు ఏఐవైఎఫ్ 20వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపు

విశాలాంధ్ర అనంతపురం : అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 20జిల్లా మహాసభలు జనవరి 7 తేదీన రాయదుర్గం పట్టణం నిర్వహించడం జరుగుతుందని.జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఐవైఎఫ్ నాయకత్వం నిరుద్యోగులు రావాలని తరలిరావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పిలుపునిచ్చారు. స్థానిక నీలం రాజశేఖర్ రెడ్డి భవనం నందు18 వ ఏఐవైఎఫ్ నగర మహాసభలు నిర్వహించారు. నగర మహాసభలకు ఏ ఐ వై ఎఫ్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, మాజీ ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీరాములు, రమణ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ అధ్యక్షులు ఆనంద్ జిల్లా ఉప్ప అధ్యక్షుడు మోహన్ కృష్ణ, దేవ పాల్గొన్నారు. ముందుగా జాఫర్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న తప్పుడు వాగ్దానాలతో బీజేపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. కులం, మతం పేరుతో విద్యార్థులు, ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. “దేశంలో ఇరవై ఎనిమిది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయినీ పెట్టుబడిదారీ వ్యవస్థ సహజ లక్షణం నిరుద్యోగం అన్నారు ఒకవైపు కొందరి దగ్గర సంపద పోగుబడడం పెరిగేకొద్దీ అత్యధిక మంది కొనుగోలు తగ్గుతోందన్నారు. ఇది మరింతగా నిరుద్యోగాన్ని పెంచుతుందనీ, దేశ ప్రజలు తమ కోసమే అనుకున్నా మంచి రోజులు ఎవరి కోసం వచ్చిందని రూ.5 వేల కోట్లకు పైగా ఆస్తులు, వనరులను కూడబెట్టిన ‘అచ్ఛే దిన్’ బీజేపీకి వచ్చిందన్నారు. కోట్లు సంపాదించడం ప్రారంభించిన చేతినిండా పెట్టుబడిదారులకు మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రతి రోజు 1000 కోట్లు కరోనా విపత్తు మధ్య ఒక సంవత్సరంలో 30 లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన 142 మంది పెద్ద ధనవంతుల కోసం అని పేర్కొన్నారు. కోట్ల విలువైన బ్యాంకు మోసాలకు పాల్పడిన బ్యాంకు దొంగల (మెహుల్ భాయ్, నీరవ్ భాయ్, విజయ్ భాయ్, సందేశరా భాయ్ తదితరులకు) ‘ వచ్చిదాని 5,40, వేల కోట్లు. కరోనా, ద్రవ్యోల్బణం మధ్య లక్షల కోట్లు సంపాదించిన హోర్డర్లు, బ్లాక్ మార్కెటర్లకు దక్కిందన్నారు. ప్రస్తుతం మనకు కూడా మంచి రోజులు వచ్చాయి అన్న పేరుతో దేశ ప్రజలకు ఏం వచ్చిందని దుయ్యబెట్టారు. వెనుకబడిన జిల్లాల నిరుద్యోగులకు ఏ ప్రభుత్వం వచ్చిన తీవ్ర అన్యాయం జరుగుతుందని చదువుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లేక జిల్లాల నుండి వలసలు పోతున్నారని. నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలు వలసలకు పోయి చాలీచాలని జీతాలతో ఒక పూట తింటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దేశంలో పాలకవర్గ విధానాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని. రాష్ట్రంలో మంచినీళ్లు కొరత ఉందేమో గాని మందు కొరత లేదని యువత గంజాయి డ్రగ్స్ వాడకం నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ గంజాయి నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందారని.యువతను సన్మార్గంలో నడిచే విధంగా అఖిలభారత యువజన సమాఖ్య రాబోయే రోజుల్లో పని చేయాలని కోరారు యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. యువతకు ఉపాధి దొరకకపోవడంతో దేశంలో ప్రతి రోజు 40 నుంచి 45మంది వరకు నిరుద్యోగులు స్వయం ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి అని తెలిపారు. విద్య ,వైద్యం, ఉపాధి ,భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులు గా గుర్తించినా విద్య ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వ్యాపారంగా మారిందని వైద్యం మాఫియా వల్ల అందరికీ అందడంలేదని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని ఆరోపించారు. నూతన పరిశ్రమలలో యువతకు ఉపాధి, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ… రాయదుర్గంలో నిర్వహించబడుతున్న ఏఐవైఫ్ 20 జిల్లా మహాసభల్లో రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని , ప్రభుత్వా శాఖల్లో ఖాళీ ఉన్నా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనీ అన్నారు. ఎన్నో పోరాట ఫలితంగా సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటికరణ కు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న దాడులకు ,వివిధ సామాజిక ,ఆర్థిక రాజకీయ, నూతన పరిశ్రమలు నెలకొల్పాలని, కియా పరిశ్రమల్లో 70 శాతం మంది ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనిఅంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం అనంతపురం ఏఐవైఎఫ్ నగర నూతన కమిటీ అధ్యక్షులు ఆనంద్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సురేంద్ర, గణేశ్,నగేష్ సహాయ కార్యదర్శులు రాంబాబు ముజీర్ కోశాధికారిగా అశోక్ తో 31 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి అలిపిర ఏఐవైఎఫ్ మాజీ నగర అధ్యక్ష కార్యదర్శులు గాదిలింగప్ప, చాంద్బాషా, జమీర్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు