Tuesday, July 15, 2025
Homeజిల్లాలుఏలూరుసాయి రాకేష్ ఒకేషనల్ కళాశాల విద్యార్థినికి ప్రతిభ అవార్డు

సాయి రాకేష్ ఒకేషనల్ కళాశాల విద్యార్థినికి ప్రతిభ అవార్డు

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : సాయి రాకేష్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2025 పరీక్ష ఫలితాలలో 968 మార్కులు సాధించిన పి. శ్యామలకు ప్రతిభ అవార్డు రావడం జరిగిందని విద్యాసంస్థల కరస్పాండెంట్ ఎస్ ఆర్ ఆర్ నరసింహారాజు తెలిపారు. తమ కళాశాలలో విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో డివిజన్ లో శ్యామల మొదటి స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. శ్యామలను పలువురు ఉపాధ్యాయులు, తల్లితండ్రులు గ్రామస్తులు, అభినందించడం జరిగిందని ప్రిన్సిపాల్ కేశవరావు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు