బీసీ సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా
విశాలాంధ్ర- ధర్మవరం : ఇటీవల మంగళగిరిలో రాష్ట్ర బీసీ సంఘం సమావేశం అత్యంత వైభవంగా విజయవంతంగా ముగిసింది. ఈ సభలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన సంకారపు జయశ్రీని ఏపీ బీసీ సంక్షేమ సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని బీసీ సంఘం నాయకులు అభిమానులు కార్యకర్తలు సంఘం పెద్దలు అందరూ కలిసి పట్టణములోని ఎస్బిఐ కాలనీలో గల జయశ్రీ ఇంటి యందు సంకారపు జయశ్రీ ను ఘనంగా సన్మానించారు. అనంతరం సంకారపు జయశ్రీ మాట్లాడుతూ నాకు బీసీ సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇచ్చిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలో తాను ప్రమాణస్వీకారం చేయడం నాకెంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను బీసీ సంఘం మహిళ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. నేడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని తెలిపారు. కానీ మహిళలు వివక్షతకు గురి కావడం చాలా బాధాకరమని తెలిపారు. మహిళలతో పాటు బాలికలు, చిన్నారులు, విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అరాచకాలు చేయడం దాడులు చేయడం రేపులు చేయడం, తదుపరి దారుణంగా హత్య చేయడం, యాసిడ్ చేయడం లాంటివి నేడు రాష్ట్రంలో అధికమయ్యాయని, వీటన్నింటిని ఎదుర్కొనేందుకు మహిళలందరూ ధైర్యంగా ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వము కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా చేస్తూ మహిళల భద్రతకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రాష్ట్రంలో 60 శాతం బీసీలు ఉన్నారని, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ సంఘమునకు చేయూత మరింత ఇవ్వాలని తెలిపారు. ఒక మహిళ ఆట వస్తువుగా, ఆట బొమ్మగా, అశ్లీలంగా చూడడం దారుణమన్నారు. అంతేకాకుండా కళాశాలలో విద్యార్థినీలను ప్రేమ పేరుతో దాడులు చేసి, చంపడం ఘోరాతి ఘోరమని, తల్లిదండ్రులకు కడుపు కోత విధించడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేసే వారి పైన ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు కోరారు. అదేవిధంగా బీసీ సంఘములో ఉంటూ ఎదిగిన వారికి రాజకీయాలలో అధిక ప్రాధాన్యత ఇస్తూ, సముచిత స్థానాన్ని కల్పించాలని వారు తెలిపారు.
ఏపీ బీసీ సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా సహకారపు జయశ్రీ ఎంపిక
RELATED ARTICLES