ప్రిన్సిపాల్ సురేష్ బాబు, నియోజకవర్గ -ఎన్ డి ఏ కార్యాలయ- మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ నందు ఉద్యోగ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించ బడ్డాయని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా ధర్మవరం నియోజకవర్గం- ఎన్డీఏ కార్యాలయం- వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఇంచార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ ధర్మవరం చివరి సంవత్సరం విద్యార్థులందరూ నూటికి నూరు శాతం అనగా 109 మంది ఉద్యోగాలు సాధించడం జరిగిందన్నారు.వీరందరూ రాయల్ ఎన్ ఫీల్డ్, విస్టన్ ఇన్ఫోకామ్, టీ ఈ కన్నెక్టివిటీ, టెస్కాం , సస్మొస్ హెచ్ ఈ టి టెక్నాలజి మొదలగు కంపినీలలో ఉద్యోగాలు పొందడం పట్ల ఆనందమును వ్యక్తం చేశారు. ఇందులో 54 మంది విద్యార్థులు రెండు కంపినీలలో ఉద్యోగాలు సాధించడం జరిగిందని,ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి హరీష్ బాబు చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమము నందు శాఖాధిపతులు హేమాంజ, బాల జోషి, కల్యాణి, ప్లేసెమెంట్ అధికారి జసింథ్ తదితరులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ లో ఉద్యోగ విజయోత్సవ వేడుకలు..
RELATED ARTICLES