- Advertisement -
- ఆంధ్రజ్యోతి విలేకరి హత్య దారుణం
-నిందితులను కఠినంగా శిక్షించాలి
– ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలి
– ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కూన అజయ్ బాబు
విశాలాంధ్ర-తిరుపతి:రాష్ట్రం లో జర్నలిస్టుల కు రక్షణ కరువైందని చెప్పడానికి చిత్తూరు జిల్లా వి కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ దారుణ హత్య నిదర్శనమని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి కూన అజయ్ బాబు అన్నారు.మంగళవారం తిరుపతి నగరంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జర్నలిస్టుల ప్రత్యేక రక్షణ కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను తక్షణం అరెస్టు చేసి కాగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శులు ఏ.సురేష్, ఎం.పి.ఆర్ రాజు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్, ఆఫీస్ బేరర్స్ నారాయణరెడ్డి, శ్రీకాంత్, తారక, శీను బాబు, కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, శ్రీరాజు, రాష్ట్ర సమితి సభ్యులు కృష్ణయ్య,కార్తీక్, జాతీయ కౌన్సిల్ సభ్యులు రాజేంద్ర, పోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు గిరిబాబు, లావణ్య, , ప్రెస్ క్లబ్ కార్యదర్శి బాలు, సహాయ కార్యదర్శి విజయ్ యాదవ్, ఫెడరేషన్ కార్యదర్శి గోపి, గాంధీ, ఫోరం నాయకులు హరిబాబు, బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ నాయకులు మునిరాజ తదితరులు పాల్గొన్నారు.


