చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి
విశాలాంధ్ర ధర్మవరం;; చేతివృత్తిదారులకు న్యాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా తప్పనిసరిగా జరగాలని చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి, కార్యనిర్వాహక అధ్యక్షులు లింగమయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఆర్థిక వ్యవస్థలో , సంస్కృతిలో చేతి వృత్తిదారుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇవి తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న కళారూపాలు, నైపుణ్యాలు. అనేక రకాల చేతి వృత్తులు ప్రాచుర్యంలో ఉన్నాయి అని,కానీ దాదాపు 20 సంవత్సరాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యాల కారణంగా ఈ వృత్తులలో బీసీ వర్గాలే అధికంగా జీవనం సాగిస్తున్నాయి అని తెలిపారు. దాదాపు 30 వృత్తులకు పైగా ఉపాధి చెందుతున్న ప్రజలు తన పిల్లల చదువుల కోసం కనీస ఖర్చులకోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నరనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని,. చేతి వృత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ఈ వృత్తుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నది అని అందుకేసత్య సాయి జిల్లా ధర్మవరంలో ఈనెల 27న చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కమిటీని ఏర్పాటు చేయడానికి చేతి వృత్తిదారుల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చేతికిచ్చిదారులలో చేనేత కార్మికులు, గొర్రెలు మేకలు పెంపకం దారులు, తాపీ మేస్త్రి వడ్రంగులు మేదర్లు (వెదురు) తయారీదారులు, కుమ్మరం దారులు, బొమ్మల తయారీ. కార్పెంటర్లు. చాకలి . చేపల పెంపు దారులు. తదితర వృత్తిదారులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లాలో 50 శాతము పైగా జీవనం సాగిస్తున్న ప్రజల సమస్య కోసం ప్రభుత్వాల నిర్లక్ష్యంగా అస్తమిస్తున్న చేతి వృత్తుల భవిష్యత్తు కోసం మా పోరాటం మరింతగా కొనసాగుతుందని తెలిపారు. కావున ఇప్పటికైనా చేతివృత్తిదారుల కుటుంబాలకు జీవన అభివృద్ధి కొరకై వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
చేతి వృత్తిదారులకు న్యాయం జరగాలి..
RELATED ARTICLES