విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బహుజనుల మహిళా సాధికారిక సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిబా పూలే అని టిడిపి జిల్లా యస్. సి. సెల్ కమిటీ సభ్యులు బొగ్గుల తిక్కన్న అన్నారు. శుక్రవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎన్ రమాకాంత్ రెడ్డి ఆదేశంతో మండల కేంద్రమైన పెద్దకడబూరు సొసైటీ ఆవరణ నందు టిడిపి నాయకులు ఎం.రామన్న జి.బుడ్డన్న ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే 198వ జయంతి సభను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి కురువ వెంకటేష్ చాకలి హనుమంతు బొగ్గుల తిక్కన్న పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొగ్గుల తిక్కన్న మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో జన్మించి సామాజికంగా తక్కువగా భావించబడే మాల కులానికి చెందిన వారన్నారు . బాల్యం నుంచి వివక్షను ఎదుర్కొన్నప్పటికీ చదువుకునే అవకాశం పొందారన్నారు. కులవ్యక్షతలు ఎదుర్కొంటున్న అనుభవాలే ఆయనను అసమానతులను అనిచవేసేందుకు ప్రేరేపించాయని కుల నిర్మూలన కోసం పూర్తిస్థాయిలో కృషి చేసిన గొప్ప మానవతావాది అన్నారు. సామాజిక న్యాయము, మహిళా సాధికారత కొరకు ఉద్యమాలు నడిపిన ధీరుడు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, విద్యనే ఆయుధంగా మలుచుకోవాలని చాటి చెప్పిన యోధుడు, కుల వివక్షతను నిర్మూలించి అందరికీ సమానత్వాన్ని నెలకొల్పే విధంగా పోరాటం చేసిన యోధుడని మహా నాయకుడిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కురువ వెంకటేష్, చాకలి హనుమంతు, నరసింహులు వీరనాగప్ప, లింగన్న, నరసప్ప, డి. రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.