Wednesday, February 18, 2026
Homeఅంతర్జాతీయంకడియం నర్సరీలు అద్భుతం.

కడియం నర్సరీలు అద్భుతం.

- Advertisement -

— హైకోర్టు జడ్జి కిరణ్మయి.

విశాలాంధ్ర – కడియం : వృత్తి రీత్యా తాను అనేక ప్రదేశాలలో పర్యటించానని, కడియం నర్సరీలలో కనిపించే అందమైన పచ్చని వాతావరణాన్ని ఎక్కడా చూడలేదని హైకోర్టు జడ్జి కిరణ్మయి అన్నారు. శనివారం కడియపులంక శ్రీ శివాంజనేయ నర్సరీని ఆమె సందర్శించారు. సర్ ఆర్డర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మల్లు పోలరాజు ఆమెకు ఘనస్వాగతం పలికారు. నర్సరీలోని వివిధ రకాల మొక్కలు పెంచే విధానం, వాటి ప్రత్యేకతలను వివరించారు. తన నివాసానికి కావలసిన కొన్ని రకాల ఇండోర్, అవుడోర్ మొక్కలను జడ్జి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడియం నర్సరీల గురించి అనేకసార్లు విన్నానని,ఇక్కడ ఆర్కిడ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ తదితర ఎలాంటి మొక్కలు కావలసినా అందుబాటులో ఉంటాయని తెలుసుకున్నానని, కొన్ని రకాల మొక్కలు కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. కడియం నర్సరీలు ఆహ్లాదకరంగా ఉన్నాయని కితాబిచ్చారు. నీటిలో, గాలిలో, భూమిమీద ఎక్కడైనా పెరిగే మొక్కలు అన్నీ ఒకేచోట పెంచడం అద్భుతంగా ఉందన్నారు. మట్టి లేకుండా గాలిలొ తేమను మాత్రమే స్వీకరించి, అద్భుతమైన పూలను వికసిస్తున్న మొక్కలు తనను బాగా ఆకర్షించాయని తెలిపారు. 20 నుండి  40 సంవత్సరాలు వరకు వయసున్న విదేశీ బోన్సాయ్ మొక్కలు పదుల సంఖ్యలో ఉండటం విశేషం అన్నారు. ఈకార్యక్రమంలో మల్లు శివ, స్థానిక నర్సరీ రైతులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు