Friday, May 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికాకతీయ విద్యానికేతన్ SSC 2024-25 సక్సెస్ మీట్

కాకతీయ విద్యానికేతన్ SSC 2024-25 సక్సెస్ మీట్

విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ విద్యార్థులు 2024 – 25 పదవ తరగతి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో వరుసగా మూడవసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 68 మంది విద్యార్థులకు గాను 68 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ తో 100 శాతము ఉత్తీర్ణత సాధించడంతో పాటు 595 అత్యధిక మార్కులు సాధించి శ్రీ సత్యసాయి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన శుభసందర్భంగా పాఠశాల ఆవరణలో సక్సెస్ మీట్ అభినందన సభ జరిగింది. పాఠశాల ఫౌండర్ శ్రీ శెట్టిపి రామిరెడ్డి గారి అధ్యక్షత లో జరిగింది. ముఖ్య అతిథులుగా ధర్మవరం మండల విద్యాశాఖాధికారి శ్రీ గోపాల్ నాయక్ ,ధర్మవరం పట్టణ టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డప్ప, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. జయచంద్రా రెడ్డి,
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆదిశేషు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కాకతీయ పాఠశాల నందు 68/68 విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం, పాఠశాల విద్యార్థులు 595, 590, 584, 583, 579 ఇలా వరుసగా అద్భుతమైన ఫలితాలు సాధించడం అభినందనీయమని, హర్షనీయమని అన్నారు. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయ బృందం, పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో శ్రమించి, రాణించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.ఈ అభినందన సభలో అత్యుత్తమ మార్కులు సాధించిన
యు.విష్ణు 595, పి.
లిఖిత 590, మార్కులతో
ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన విష్ణు, లిఖిత,లకు ముఖ్య అతిథులు మెమెంటోలు, నగదు బహుమతులు అందజేశారు. .వీరితోపాటు మొత్తం విద్యార్థులందరికీ మెమెంటోలు, అందజేశారు.
పాఠశాల ఫౌండర్స్ శెట్టిపి రామిరెడ్డి, చెన్న కృష్ణమ్మ, కరస్పాండెంట్ శ్రీమతి నిర్మలాదేవి, డైరెక్టర్స్ శెట్టిపి సూర్యప్రకాశ్ రెడ్డి, శెట్టిపి పద్మ చేతుల మీదుగా ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయ బృందమును, నాన్ టీచింగ్ బృందమును, మొత్తం పాఠశాల బృందమునకు పట్టు చీరలు బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, నాన్ టీచింగ్ బృందం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు