Homeఆంధ్రప్రదేశ్భూసేకరణ సమస్యలతో ఆగిన కాళేశ్వరం పనులు...

భూసేకరణ సమస్యలతో ఆగిన కాళేశ్వరం పనులు…

- Advertisement -

నిజామాబాద్‌ జిల్లా పరిధిలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, 21ఎ ప్యాకేజీలకు సంబంధించిన పనులు భూసేకరణ సమస్యలు, ఇతర పరిపాలనా అడ్డంకుల కారణంగా ఇంకా పూర్తిస్థాయిలో ముగియలేదు. 20వ ప్యాకేజీ పరిధిలో నవీపేట మండలంలోని బినోల గ్రామం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర మాత్రమే కాలువ తవ్వకాలు పూర్తయ్యాయి. అయితే ఆ కాలువ ద్వారా నీటిని పొలాలకు చేరేలా చేసే మిగతా పనులు ఇంకా కొనసాగలేదు. అదే విధంగా 21వ ప్యాకేజీ కింద మోపాల్‌ సమీపంలో కాలువ తవ్వకాలు చేపట్టినా, అక్కడి నుంచి రైతు పొలాలకు నీటిని అందించే వ్యవస్థ మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు.

రైతులపై అదనపు భారం
దీంతో ప్రాజెక్టు లక్ష్యానికి అనుగుణంగా నీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ప్రధాన కాలువల్లోకి చేరుతున్న నీటిని రైతులే తమ సొంత ఖర్చుతో, భారీ శ్రమతో పొలాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలువల్లో మోటార్లు అమర్చి, దాదాపు ఒక కిలోమీటరు దూరం వరకూ పైపులు వేసి నీటిని ఎత్తిపోస్తూ పంటలను సాగు చేస్తున్నారు. ఇలా వ్యయప్రయాసలు భరించాల్సి రావడంతో రైతులపై అదనపు భారం పడుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు