విశాలాంధ్ర -ధర్మవరం : జీ తెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ లో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన విద్యార్థిని అండ్ గాయని లక్ష్మీ చౌదరి తన ప్రతిభను చాటారు. వివరాలకు వెళితే ధర్మవరం పట్టణం కోర్టు రోడ్డు నందు శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీదారులు గోవింద్ చౌదరి, లక్ష్మీ చౌదరి (అమ్మమ్మ) మనవరాలు, తండ్రి అనంత సయన, తల్లి కీర్తి చౌదరిల కుమార్తె లక్ష్మీ చౌదరి చిన్నతనము నుంచి చదువుతోపాటు గత ఎనిమిది సంవత్సరాలుగా కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యం, లలిత సంగీతములో ఎంతో సాధన చేసి, పలుచోట్ల గుర్తింపు పొందారు. లక్ష్మీ చౌదరి తల్లిదండ్రులు కూడా ఈమె ప్రతిభను గుర్తించి, చదువును ప్రోత్సహించడంతోపాటు సంగీతం పట్ల మక్కువ చూపిస్తూ, ఎంతో ఉత్సాహపరిచారు. దీంతో తల్లిదండ్రులు జీ తెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ లో వెళ్లాలన్న అకుంఠిత దీక్షతో అనంతపురంలో ఆడిషన్ మొదటి రౌండు కు సెలెక్ట్ కావడం, తదుపరి హైదరాబాదులో కూడా సెలెక్ట్ కావడంతోపాటు మెగా అడిషన్ లో ఈనెల 6వ తేదీన జీ తెలుగు టీవీలో జీ తెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ లో చిన్నారి లక్ష్మీదేవి తన పాటతో అందరినీ అబ్బురపరిచింది. ఆట అనే సినిమాలో ఏల ఏల అనే పాటను ఎంపిక చేసుకొని జి తెలుగు లో తన ప్రతిభను కనబరిచింది. తాను పాడిన ఈ పాటకు ముగ్ధులైన జడ్జీలు ఎస్పీ శైలజ, అనంత శ్రీరామ్, అనిల్ రావు పూడి, కొణిదల నీ హారిక ఎంతగానో మెచ్చుకొని అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత గాయని అయిన చిన్నారి లక్ష్మీదేవి 12 సంవత్సరాల వయసులో ధర్మవరం సమీపంలోని గొల్లపల్లిలో గల మాంటిస్టోరీ ఎలైట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది. ఈనెల ఆరవ తేదీన జీ తెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ లో టీవీలో ప్రోగ్రాం రావడంతో అటు తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు, పాఠశాల వారు, తోటి విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
జీ తెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ లో మెరిసిన ధర్మవరం గాయిని.. లక్ష్మీ చౌదరి
- Advertisement -
RELATED ARTICLES


