Homeజాతీయంకేరళలో ఎల్ డీ ఎఫ్ అధికారంలోకి వస్తుంది

కేరళలో ఎల్ డీ ఎఫ్ అధికారంలోకి వస్తుంది

- Advertisement -


కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్య


తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి వినరాయి విజయం నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్ డీ ఎఫ్ ) తిరిగి అధికారంలోకి వస్తుందని కేరళ సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు. అయితే… ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. అయ్యర్ కాంగ్రెస్ పార్టీలో లేరని రమేష్ చెన్నితాల పేర్కొన్నారు. అయ్యర్ మాత్రం తన దాడిని ఆపలేదు, మరో అడుగు ముందుకేసి కేరళలో కాంగ్రెస్ నెగ్గదని… ఎల్ డి ఎఫ్ అధికారంలోకి వస్తుందని సోమవారం ఆయన పునరుద్ఘాటించారు. ” తాను పార్టీ సభ్యుడిని రాహుల్ గాంధీ మరిచిపోయారని… తాను గాంధీవాదిని, నెహ్రూ వాదిని, రాజీవ్ వాదిని కానీ రాహుల్ వాదిని మాత్రం కాదు. వ్యక్తిగతంగా మాత్రం యూడీఎఫ్ గెలవాలనుకుంటున్నాను కానీ… గాంధీయవాదిగా వాస్తవం చెప్పాలి. ఎన్ఆర్ఐ విజయం ప్రభుత్వం అధికారంలోకి రానుంది, కాంగ్రెస్ కు ఎవరు ఓటు వేస్తారు? ఆ పార్టీ నాయకత్వంలో సఖ్యత లేదు. పవన్ కేడా వంటి వ్యక్తి కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారంటేనే పార్టీ దుస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయన జయరాం రమేష్ ఏం చెబితే అది చేస్తారు ” అని అయ్యర్ పేర్కొన్నారు. శశి ధరూర్ కు సిద్ధాంతాలు లేవని విమర్శించారు. భాజపా ప్రభుత్వంలో జై శంకర్ స్థానంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అవ్వాలని జై రామ్ రమేష్ అనుకున్నారు అని ఆరోపించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు