- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; సిపిఎం, సిఐటియు నాయకులు కామ్రేడ్ హైదర్ వలీ మృతికి సంతాపం తెలుపుతూ అంతక్రియలకు భారీగా వామపక్ష పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు, అదేవిధంగా స్థానిక ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కామ్రేడ్ హైదర్ వలీ గారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, అంత్యక్రియలలో పాల్గొన్నారు. అనంతరం హైదర్ వలీ పేద ప్రజలకు చేసిన సేవలు, సిపిఎం, సిఐటియుకు చేసిన సేవలను కొనియాడారు.


