– ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం – యు టి ఎఫ్
విశాలాంధ్ర ధర్మవరం: బడి అంటే ఉపాధ్యాయులు, విద్యార్థి, నాలుగు గోడలు, సిలబస్, పరీక్షలు, ర్యాంకులు మాత్రమే కాదు అని, ఈ బడి చుట్టూ సమాజం ఉంది అని,భవిష్యత్తులో ఈ బడిలో తయారయ్యే బాలబాలికలు సమాజ అవసరాలు తీర్చగలిగిన వనరులుగా మారాలి అనేది విద్య యొక్క లక్ష్యం అని,ఆ లక్ష్య సాధన మన చేతుల్లోనే ఉంది అని కాబట్టి అటువంటి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవడం ఉపాధ్యాయులందరి బాధ్యత అని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నందు యూటీఎఫ్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు డి. శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రామకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూటీఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ భావిభారత పౌరులను సమాజం పట్ల బాధ్యతగా, కుటుంబం పట్ల గౌరవంగా, తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే పౌరుడుగా తయారు చేయటం మన బాధ్యతగా భావించి పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2026-27 నూతన అకాడమిక్ సంవత్సరం 2026 జూన్ ప్రారంభం కాబోతుంది అని,బడి ఈడు కలిగిన పిల్లలందరూ మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించే దానికోసం ఉపాధ్యాయులుగా మనం ప్రత్యేక భాధ్యతలు తీసుకోవాలి అని తెలిపారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ బడి పట్ల నమ్మకాన్ని కలిగించే బాధ్యతను కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ బడిలో ఉన్న సదుపాయాలని పిల్లల తల్లిదండ్రులకు చెప్పి, వారిలో ప్రభుత్వ బడిపై నమ్మకాన్ని కలిగించాలి. మీ బిడ్డలను భావిభారత పౌరులుగా సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన మనుషులుగా తీర్చిదిద్దుతామనే ఒక భరోసా, నమ్మకాన్ని సమాజానికి కల్పించే పని చేద్దామని చెప్పారు. అందుకోసమే యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 2026 ఫిబ్రవరి నుండి క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ పనిలో యూటీఎఫ్ నాయకులు , కార్యకర్తలే కాకుండా ఉపాధ్యాయ మిత్రులందరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు.అనంతరం క్యాంపెయిన్ కు సంబంధించిన గోడపత్రికలను స్థానిక నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి శ్రీనివాసులు ,ఆర్ రామకృష్ణ నాయక్ ,జిల్లా పూర్వపు ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు జి.హెచ్. బాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు గౌరమ్మ, జిల్లా కోశాధికారి సి. లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శిలు పి. అమర్ నారాయణరెడ్డి, ఎల్. రవివర్ధన్ రెడ్డి, పి. మురళి, ఎస్. చెన్నకేశవులు, సి. నాగేంద్రమ్మ, ఎం. బాబు, రాష్ట్ర కౌన్సిలర్స్ ఎం. మేరీ వర కుమారి, యు. మహంతేశ్వర, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ కే. సునీల్ కుమార్ ,పూర్వపు జిల్లా కార్యదర్శి బి. కిష్టప్ప ధర్మవరం పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జింక హరికృష్ణ, హెచ్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


