ఎంపీడీవో భాస్కర్
విశాలాంధ్ర -శింగనమల : ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ ఉపయోగం ఎక్కువగా ఉందని దీనివల్ల వాతావరణ కాలుష్యం భూకాలష్యం తదితరాల వల్ల మానవాళి మనగడకు ముప్పు పొంచి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలని ప్లాస్టిక్ రహిత శింగనమలగా తీర్చిదిద్దుతానని ఎంపీడీవో భాస్కర్ మీడియా సమావేశ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో పట్టణాలలో బహిరంగ ప్రదేశాలలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయని, అందువల్ల అనర్థాలు పెరిగిపోతున్నాయని, ప్లాస్టిక్ ను నియంత్రించకపోతే భవిష్యత్తులో మనుగడ అసాధ్యమన్నారు. భూమి అన్నీ జీర్ణించుకుంటుందని కానీ ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రం జీర్ణించుకోవడం కష్టతరమన్నారు. దుఖాణాలకు, వెళ్లేటప్పుడు ప్రజలు బ్యాగులు తీసుకొని వెళ్లాలని, ప్లాస్టిక్ సంచులను, కవర్లను, గ్లాసులను, ప్లాస్టిక్ తో తయారయ్యే పదార్థాలను వాడకూడదని సూచించారు, దుఖాణాదారులు ప్లాస్టిక్ వస్తువులను అమ్మ రాదని పేపర్లతో కూడిన కవర్లను ఉపయోగించాలన్నారు. దుఖాణాదారులు వ్యర్థాలను రోడ్లపై పడవేస్తున్నారని, వ్యర్ధాలను డబ్బాలలో వేసుకొని పంచాయతీ కార్మికులు వచ్చినప్పుడు అందులో వేయాలన్నారు.
ప్లాస్టిక్ రహిత శింగనమల గా తీర్చిదిద్దుతా
- Advertisement -


