ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సర్పంచ్ ల పదవీ కాలం, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం మార్చిలో ముగియనుండగా.. చట్టంలోని వెసులుబాట్ల మేరకు జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మేరకు పురపాలక, పంచాయతీరాజ్ కమిషనర్లకు ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
లేఖలో పేర్కొన్న షెడ్యూల్..
అక్టోబరు 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
నవంబరు 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రచురణ
నవంబరు 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకం
నవంబరు 30లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల ఏర్పాట్లు
డిసెంబరు 15లోపు రిజర్వేషన్లు ఖరారు
2026 జనవరిలో నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన


