Homeఆంధ్రప్రదేశ్బంగాళాఖాతంలో అల్పపీడనం… ఏపీలో నేడు, రేపు అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం… ఏపీలో నేడు, రేపు అతి భారీ వర్షాలు

- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమమధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆయన తెలిపారు. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి, ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల వైపుగా పయనించే అవకాశం ఉందని వివరించారు. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు