Wednesday, January 14, 2026
Homeజిల్లాలుఅనకాపల్లిఎం.ఎస్.రావ్ షాపింగ్ మాల్ 26 వ వార్షికోత్సవ సంబరాలు

ఎం.ఎస్.రావ్ షాపింగ్ మాల్ 26 వ వార్షికోత్సవ సంబరాలు

- Advertisement -

ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ఎం.వి.ఆర్
విశాలాంధ్ర_అనకాపల్లి: పట్టణంలో గత 26 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతున్న ఎం ఎస్ రావ్ షాపింగ్ మాల్ 26వ సంవత్సరం వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎం.ఎస్.రావ్ షాపింగ్ మాల్ అధినేత ముత్యాల సుబ్బారావు ( చిన్ని) కి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ముందుగా ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) దంపతులకు షాపింగ్ మాల్ సిబ్బంది ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఎం.వి.ఆర్ సోదరుడు ఎం.ఎస్.రావ్ అధినేత ముత్యాల సుబ్బారావు మాట్లాడుతూ. గత 26 సంవత్సరాల నుంచి చిన్న స్థాయి నుంచి ఈరోజు ఎంతటి స్థాయికి ఎదగడానికి కారణమైన కస్టమర్లకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్థాయికి తీసుకొచ్చిన కస్టమర్లకు రుణపడి ఉంటానని ఈ 26వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మా కొనుగోలుదారులందరికీ ప్రత్యేకమైన ఆఫర్లు కల్పించామని అలాగే నా వెన్నంటే ఉండి నా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న అన్నయ్య ఎం.వి.ఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల వెంకటేశ్వరరావు తనయులు రాజేష్ , సంజయ్ బాబు , ఎం.వి.ఆర్ యువసేన సభ్యులు , అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు