Wednesday, January 14, 2026
Homeజిల్లాలుఅనంతపురంపంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం

పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం

- Advertisement -

రైతు సంక్షేమం ఎక్కడుంది ?…ప్రభుత్వం మెుద్దు నిద్ర వీడాలి

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పంటలను రోడ్డుపై పడేస్తున్నారని రైతుల అరణ్య రోదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. శనివారం స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిరులు కురిపించే పంటలు నేడు రైతన్న కంట కన్నీరు తెప్పిస్తుందని రైతన్నల ఆక్రందన కూటమి ప్రభుత్వానికి పట్టక పోవడం సిగ్గుచేటు’అని ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లాలో అరటి పంటకు గిట్టుబాటు ధర లేక నాగ లింగయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అరటి పండించిన రైతులు ధర లేకపోవడంతో పంటను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు అన్నారు. పత్తి, కంది, మిరుప, మొక్కజొన్న ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదని రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. రైతుల యొక్క సమస్యలను పక్కదారు పట్టించడానికి రైతన్న మీకోసం అనే కొత్త డ్రామాను చంద్రబాబు ప్రభుత్వం మొదలుపెట్టిందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఎక్కడ కూడా స్పందన రాలేదని. కేవలం అధికార పార్టీ నాయకులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని తెలిపారు. గత రబీ సీజన్లో 100% రైతులు పప్పు శనగను సాగు చేసుకున్న తర్వాత ప్రభుత్వం పప్పుశనగ పంపిణీ చేసిందని ఈ సబ్సిడీ విత్తనాలన్నీ బ్లాక్ మార్కెట్ కి తరలించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో రైతుల సంక్షేమానికి ఏ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టలేదు అన్నారు. యూరియా దొరకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం,పంటల బీమా,సబ్సిడీ వ్యవసాయ పరికరాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆర్బికే కేంద్రాలను నిర్వీర్యం చేశారని అన్నదాత సుఖీభవ కింద రావలసిన 40 వేల రూపాయలు కు గాను కేవలం 10వేలు మాత్రమే మంజూరు చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం పైనే కేంద్రీకృతమైందన్నారు. మెడికల్ కళాశాల లు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉరవకొండ నియోజకవర్గంలో 60,వేలు సంతకాల సేకరణ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈనెల 10వ తేదీన సేకరించిన సంతకాలపై ఉరవకొండలో సభ నిర్వహిస్తున్నామన్నారు. 13వ తేదీన అనంతపురంలో ర్యాలీ నిర్వహించి. 16వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన సంతకాలను గవర్నర్ కు అంద చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు