విశాలాంధ్ర, ఉరవకొండ( అనంతపురం జిల్లా) : జాతీయ స్థాయిలో జరిగే ఖోఖో పోటీలకు వజ్రకరూరు మండలం చిన్న హోతూరు ప్రభుత్వ హైస్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న ఆర్. వీణ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మరియు పిడి ప్రభాకర్ తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గత నెల 28, నుంచి 30 కొరకు అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్14 ఖోఖో బాలికల విభాగంలో అనంతపురం జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆర్.వీణ అత్యధిక ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు వారు తెలిపారు.
ఈ జాతీయ క్రీడా పోటీలు 2026 జనవరి లో రాజస్థాన్ లొ జరుగుతాయని జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు వీణ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న సోషల్ ఉపాధ్యాయులు నారాయణ స్వామి, ప్రత్యేకంగా జాతీయ స్థాయికి ఎంపికైన వీణాను అభినందించి వారికి స్పోర్ట్స్ కిట్ స్పాన్సర్ చే శారు. మిగతా ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ అమ్మాయిని అభినందించారు.
జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన చిన్న హోతురు విద్యార్థిని వీణ
- Advertisement -


