- Advertisement -
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న గౌస్ సాహెబ్ కు డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి రావడంతో శనివారం ఆయన వజ్రకరూరు మండలానికి గ్రామ మరియు వార్డు సచివాలయ నిర్వహణకు అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రకరూరు మండలంలోని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పారదర్శకంగా పనులు జరిగే విధంగా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మరియు సచివాలయ సిబ్బంది బాధ్యతలు స్వీకరించిన గౌస్ సాహెబ్ కు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు.


