విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని జీవీ ఈ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినీలు అండర్14 మైనస్ 32 కేజీ విభాగంలో వి.సింధు గోల్డ్ మెడల్ అండర్ 19 జి.యువ సంధ్యా మైనస్ 36 కేజీ గోల్డ్ అలానే అండర్ 14 మైనస్ 36 కేజీ విభాగంలో దాక్షాయిని గోల్డ్ మెడల్ సాధించి , జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపికవ్వడం జరిగింది అని కోచ్ ఇనాయత్ భాషా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 28 నుండి 30 వ తేదీలలో చిగిచెర్లలో జరిగినటువంటి జూడో ఎస్ జి పోటీలలో ప్రతిభ ఘనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. త్వరలో జరగబోయే తేదీలలో రాజస్థాన్ ఢిల్లీలో జరగబోయే ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపిక ఇవ్వడం జరిగింది అని తెలిపారు. హెడ్మాస్టర్ సుమనా మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ పిల్లలకు అభినందిస్తూ అలానే రానున్న రోజుల్లో అంతర్జాతీయ ఒలంపిక్స్ వరకు మెడల్స్ సాధించి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు అధ్యక్షులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే చదువుతోపాటు క్రీడలు కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకొని చదువులు పట్ల ఉద్యోగాల పట్ల స్పోర్ట్స్ కోటాలో 3 శాతము రిజర్వేషన్ కూడా ఉంటుందని తెలిపారు. కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరూ కరాటే జూడో క్రీడలను నేర్చుకోవాలని తెలిపారు. అనంతరం
కోచ్ ఇనాయత్ భాషా, నవ్య శ్రీ, హెడ్మాస్టర్ సుమన, ఉపాధ్యాయ బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
జీవి ఈ జెడ్పి గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులుకు బంగారు పతకాలు
- Advertisement -
RELATED ARTICLES


