విశాలాంధ్ర -అనంతపురం : స్థానిక శివకోటి శ్రీ పీఠం దేవస్థానంలో ఈనెల 14 నుంచి 17 వరకు భారతదేశం సుభిక్షంగా ఉండాలని మహారుద్ర సహస్ర శంఖాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శివకోటి శ్రీ పీఠం వ్యవస్థాపకులు శ్రీ అప్పా స్వామి పేర్కొన్నారు. బుధవారం స్థానిక శివకోటి దేవాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కార్తీక బహుళ నవమి నుండి త్రయోదశి వరకు ఆలయంలో 14న శివలింగ చర ప్రతిష్ట, 15న లక్ష బిల్వార్చన, 16న సహస్ర శంఖారాధన, 17న మహా గౌరీ శత రుద్ర యాగము, మహా పూర్ణాహుతి, విశేష పూజలలో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆలయ ట్రస్ట్ కార్యదర్శి అమర్నాథ్ శర్మ, ప్రధాన అర్చకులు హరి, ట్రస్ట్ మేనేజర్ నరసింహ, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


