శ్రీ సాయి రూరల్ విభిన్న ప్రతిభావంతుల మండల సమైక్య
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణము లోని శ్రీ సాయి రూరల్ విభిన్న ప్రతిభావంతుల మండల సమైక్య కు స్థలమును ప్రభుత్వం కేటాయించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో నటరాజ్, ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని ఆ సమైక్య సంఘం వారు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మా మండల సమైక్యలో 44 గ్రామాలలో సంఘాలు ఏర్పాటు చేసుకున్నామని సంఘములలో 900 మంది వికలాంగులు సభ్యులుగా ఉన్నామని తెలిపారు. మండల సమైక్య సంఘమును 2006లో అద్దె భవనంలో ఉంటున్నామని తెలిపారు. అద్దె కట్టుటకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. కావున మా కష్టాలను గుర్తించి మాకు 10 సెంట్లు స్థలాన్ని కేటాయించవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాంతమ్మ, కార్యదర్శి కొండయ్య, సభ్యులు ఈశ్వరక్క ,లక్ష్మి ,ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు స్థలము కేటాయించండి…
RELATED ARTICLES