విశాలాంధ్ర, అనంతపురం : గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శివై.ఎల్.రామాంజనేయులు ఆధ్వర్యంలో, జిల్లా కో-కన్వీనర్ కృష్ణా నాయక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ధర్నా అనంతరం గిరిజన నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో మోలోలాకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. గిరిజనుల హక్కులను పరిరక్షించడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం, రుణ సదుపాయాలు, అటవీ హక్కులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.ఎల్. రామాంజనేయులు, జిల్లా కో-కన్వీనర్ కృష్ణా నాయక్, రాష్ట్ర నాయకులు రవీంద్ర, జిల్లా నాయకులు చంద్రశేఖర్, వెంకటేశులు, కదిరప్ప, నాగన్న, చలపతి తదితర గిరిజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


