విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : భారతదేశంలో విద్య వ్యాప్తికి ప్రధాన కారకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని మండలంలో కుంతల గూడెం గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాయపూడి. వెంకటరమణ మాట్లాడుతూ భారత దేశంలో విద్యావ్యాప్తికి, అభివృద్ధికి, అబుల్ కలాం చేసిన సేవలను విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే. అమృత, కే. ఏసేపు, కే. రూత్ పాలేనా,బాల బాలికలు పాల్గొన్నారు.