విశాలాంధ్ర – నిడదవోలు :తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు లోని స్థానిక రోటరీ ఆడిటోరియం లో రోటరీ క్లబ్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ డా.వై.కళ్యాణ చక్రవర్తి పిలుపుమేరకు రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ మీసాల శివరామ హరిప్రసాద్ ఆధ్వర్యంలో విశ్వబంధుత్వ దినోత్సవ శుభ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సంయుక్త ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో రక్తదానం చేయుట ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నమోదుకై మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.కాకినాడరోటరీ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి 28 మంది రక్తదాతలు విచ్చేసి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు శేషగిరి హాస్పటల్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పాటే అయ్యప్పలు సహాయ సహకారాలు అందించగా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ మీసాల శివరామ హరిప్రసాద్, సెక్రెటరీ దారపురెడ్డి శ్రీరామ ప్రతాప్, ట్రెజరర్ గుంటిపల్లి సత్యసాయి, ఈరిశెట్టి రాజగోపాలస్వామి, ఎండి ఫయాజ్, బచ్చు సుమన్, కేదారిశెట్టి రవికుమార్, సానేపు వెంకటసుబ్బారావు, మద్దుల కోటేశ్వరరావు, ఆకుల ముకుందరావు, బ్రహ్మకుమారీస్ సిస్టర్ శశిరేఖ, కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ డా.కామరాజు, ల్యాబ్ టెక్నీషియన్స్, తదితరులు పాల్గొన్నారు.
మెగా రక్తదాన శిబిరం
- Advertisement -
RELATED ARTICLES


