Wednesday, December 18, 2024
Homeజిల్లాలుఏలూరుగురుకులంలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్

గురుకులంలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్

విశాలాంధ్ర –తాడేపల్లిగూడెం రూరల్ : తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఏర్పాటు చేసారని తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ అన్నారు పెడతాడేపల్లి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో తల్లిదండ్రులకు కబడ్డీ,ముగ్గుల పోటీలు,సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించారు అనంతరం నిర్వహించిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ప్రిన్సిపల్ బి.రాజారావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తహసీల్దార్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎంచుకున్న రంగంలో విజయం సాధించేవరకు కృషి పట్టుదలతో ముందుకు సాగాలన్నారు ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాలన్నారు, ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు మండల విద్యాశాఖ అధికారి హనుమ మాట్లాడుతూ విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యా ప్రణాళికతో పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు రూరల్ ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, విద్యార్థి స్థాయి నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి, విద్యార్థులను తల్లిదండ్రులు ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 జ్యోతి, ఎస్ఎంసి చైర్మన్ ప్రకాష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రతాప్ ఉపాధ్యాయులు,విద్యార్థులు తల్లిదండ్రులుసిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు