ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కొడుకు మతేయో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంటర్ మియామీ అకాడమీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు నేపుల్స్ కప్ టైటిల్‌ను అందించాడు. త్వరలో 11వ పుట్టినరోజు జరుపుకోబోతున్న మతేయో.. చిన్న వయసులోనే తన ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నేపుల్స్ కప్ ఫైనల్లో ఇంటర్ మియామీ అకాడమీ విజయం సాధించింది. టైటిల్ గెలిచిన తర్వాత మతేయో ట్రోఫీతో ఫొటోలకు పోజిచ్చాడు. ‘ఛాంపియన్్ణ అని రాసి ఉన్న కప్‌ను చేతిలో పట్టుకుని చిరునవ్వులు చిందించాడు. స్పానిష్ పత్రిక ‘మార్కా’ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.మెస్సీకి ముగ్గురు కుమారులు. మతేయో రెండో కుమారుడు. సెప్టెంబర్ 11న అతడు 11వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. పెద్ద కుమారుడు థియాగో వయసు 13 ఏళ్లు. చిన్న కుమారుడు సిరోకు 8 ఏళ్లు.
మతేయో విజయంపై మెస్సీ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి బాటలోనే ఫుట్‌బాల్‌లో ముందుకు సాగుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అర్జెంటీనా జాతీయ జట్టుతో తన 21 ఏళ్ల ప్రస్థానానికి మెస్సీ ఇటీవల ముగింపు పలికిన విషయం తెలిసిందే. 2026 ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓడిన రెండు రోజుల తర్వాత జులై 21న తన రిటైర్మెంట్ సందేశాన్ని రాసినట్లు మెస్సీ వెల్లడించాడు. 2022లో అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన మెస్సీ.. జాతీయ జట్టుతో ఇకపై మైదానంలో కనిపించబోనని స్పష్టం చేశాడు.


