Homeఅంతర్జాతీయం22% పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం..

22% పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం..

- Advertisement -

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం రికార్డు స్థాయికి చేరింది.2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆయన 96.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 800 కోట్లకు పైగా) జీతాన్ని పొందారు.గత దశాబ్ద కాలంలో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇది అత్యధిక వేతనం కావడం విశేషం.ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మైక్రోసాఫ్ట్ సాధించిన విజయాలను గుర్తిస్తూ ఆయన జీతాన్ని పెంచారని సమాచారం ఉంది.మైక్రోసాఫ్ట్ రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం,నాదెళ్ల వేతనంలో ఎక్కువ భాగం షేర్ల రూపంలో ఉంటుంది.ఆయన ప్రాథమిక జీతం 2.5 మిలియన్ డాలర్లు కాగా,మిగిలిన 90 శాతం వేతనం కంపెనీ షేర్లలో అందుతుంది.

ఓపెన్‌ఏఐలో ముందస్తు పెట్టుబడులు
గత ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం 79.1 మిలియన్ డాలర్లు మాత్రమే ఉండింది.
కంపెనీ బోర్డు తెలిపినట్టుగా, టెక్నాలజీ రంగంలో ఏఐ శక్తివంతమైన మార్పులను తెచ్చింది,ఆ సమయంలో నాదెళ్ల నేతృత్వం మైక్రోసాఫ్ట్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపిందని అన్నారు.నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ షేరు విలువ ఈ ఏడాదిలో సుమారు 23 శాతం పెరిగింది.ముఖ్యంగా అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం పోటీదారులు అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను మించి స్థిరమైన వృద్ధిని చూపుతోంది.ఒక చిన్న స్టార్టప్‌గా ఉన్న ఓపెన్‌ఏఐలో ముందస్తు పెట్టుబడులు పెట్టడం కూడా ఆయనకు లాభదాయకమయ్యింది.చాట్‌జీపీటీ సక్సెస్ తర్వాత, మైక్రోసాఫ్ట్ ఆ సంస్థలో పెట్టుబడులను 10 బిలియన్ డాలర్ల వరకు పెంచింది.

29.5 మిలియన్ డాలర్లు వేతనం పొందిన అమీ హుడ్
ఇప్పుడు ఆఫీస్ టూల్స్, క్లౌడ్ సేవలతో పాటు దాదాపు అన్ని మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో ఓపెన్‌ఏఐ టెక్నాలజీని అనుసంధానించారు.సత్య నాదెళ్ల వ్యూహాత్మక నిర్ణయాల వల్లే మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ రంగాల్లో అగ్రస్థానానికి చేరింది.ఆయన నాయకత్వంలో లింక్డ్‌ఇన్, గిట్‌హబ్, యాక్టివిజన్ బ్లిజార్డ్ వంటి కీలక సంస్థలను కొనుగోలు చేసి, సాఫ్ట్‌వేర్, గేమింగ్, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ రంగాల్లో కంపెనీ విస్తరణ సాధించింది.
ఆయనతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (జఖీూ) అమీ హుడ్ 29.5 మిలియన్ డాలర్లు వేతనం పొందారు, అలాగే కమర్షియల్ బిజినెస్ హెడ్ జడ్సన్ ఆల్తాఫ్ 28.2 మిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు