విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ ఆయకట్టు పరిధిలోని రైతులకు ఆరుతడి పంటల సాగు కోసం నీటిని విడుదల చేయనున్నట్లు మంగళవారం అనంతపురంలో జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించడంపై ఉరవకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఉరవకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ రైతుల కష్టాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి పయ్యావుల కేశవ్ రైతు పక్షపాతిగా మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకున్నారని వారు పేర్కొన్నారు. తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ముందుగా తాగునీటికి ప్రాధాన్యతనిస్తూ, అనంతరం ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలన్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేయాలని నిర్ణయించినందుకు రైతుల తరఫున మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకులు మాజీ సర్పంచ్ ఎర్రగుంట్ల వెంకటేష్, నింబగళ్లు గడుపుటి చంద్ర మోహన్, నెట్టెం సుధాకర్, నెట్టెం సుభాష్ చంద్రబోస్, కోనేటి శేషు, కోనాపురం వెంకటేష్, ఇంద్రావతి సుధాకర్, ఓబులేసు, కొట్టాలపల్లి తమ్మినేని లోకేష్, వెలిగొండ పవన్, బోయ చౌడప్ప, షేక్ మహబూబ్ బాషా, కౌకుంట్ల రవి, మీనుగ రామాంజనేయులు తదితరులు. ఉన్నారు.


