Homeజిల్లాలుఅనంతపురంవైఎస్సార్‌ సేవలు చిరస్మరణీయం

వైఎస్సార్‌ సేవలు చిరస్మరణీయం

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి వైఎస్సార్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఏసీ ఎర్రిస్వామి, అశోక్‌కుమార్, బసవరాజు, ఈడిగ ప్రసాద్, తిప్పయ్య, ఎర్రిస్వామిరెడ్డి, గోవిందు, వస్కిరి మల్లికార్జున, వన్నూరు సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు