విశాలాంధ్ర ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఉరవకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన అమలు చేసిన పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాళ్ల ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సోనియా శీన, మైనార్టీ నాయకుడు అబ్బాస్, పార్టీ నాయకులు సుధాకర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి
- Advertisement -


