విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. అనంతరం మంత్రి ఒక ప్రకటనలో మాట్లాడుతూ పవిత్రత, సహనం, దానం, సేవాభావం, ఆత్మశుద్ధి వంటి మహత్తర విలువలను ప్రపంచానికి చాటిచెప్పే ఈ రంజాన్ మాసం ప్రతి ఇంటికి శాంతి, ఆనందం, ఐశ్వర్యం నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించుకోవడమే కాకుండా సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలు మరింత బలపడాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేకూఈ పవిత్ర మాసంలో ప్రతి కుటుంబంపై దైవ అనుగ్రహం నిలిచి, ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి ప్రసాదించాలని ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతూ ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని, ప్రతి ఇంట్లో సంతోషాలు వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు.
ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు
- Advertisement -
RELATED ARTICLES


