Tuesday, April 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి28వ వార్డు ఎల్4 లో నీటి సమస్య తీర్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్

28వ వార్డు ఎల్4 లో నీటి సమస్య తీర్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్

విశాలాంధ్ర ధర్మవరం:: గత కొన్ని రోజుల కిందట పట్టణంలోని 28వ వార్డులో ఎల్ ఫోర్ కాలనీ వాసులు గత కొన్ని నెలలుగా నీటి సరఫరా లేకపోవడంతో రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కమిషనర్ పోలీసులతో బాధితులు వాగ్వివాదం జరిగింది. చివరకు కమిషనర్ హామీ ఇవ్వడంతో సద్దుమణిగిన వైనం జరిగింది. తదుపరి ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, నియోజకవర్గ ఎన్ డి ఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు ఆ కాలనీ వాసులతో ఇటీవలే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఎల్ఫోర్ కాలనీలో బోరును వేయించారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతూ ఈ కాలనీ ప్రజలకు తాగునీటి కొరత ఉండకూడదని, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇక్కడ నీటి సమస్య తీవ్రంగా మారింది అని తెలిపారు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలనే లక్ష్యంతో మంత్రిగారి ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎల్4 కాలనీ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఈ బోరు ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఇది మొదటి అడుగు మాత్రమే, భవిష్యత్తులో దీర్ఘకాలిక పరిష్కారానికి మరిన్ని ప్రణాళికలు రూపొందించేందుకు కృషి చేస్తున్నాం, అని అన్నారు. ప్రాంత ప్రజలు వారి నీటి సమస్యను పరిష్కరించి బోర్ వేసి నీటి సదుపాయం కల్పిస్తున్న, ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జ్ హరీశ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో మరిన్ని ప్రాంతాలలో నీటి సమస్యను పూర్తిగా నివారించేందుకు కృషి చేస్తామని హరీశ్ బాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజ్ ప్రకాష్, చిలకల సుధాకర్, వన్ను శ్రీరాములు, బీజేపీ పూలకుంట మహేష్, రిపన శ్రీరాములు, పవన్ కుమార్ రెడ్డి, రవీంద్రారెడ్డి, నాగమణి, సరస్వతి, నరసింహులు, ఆదిరెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు