Thursday, January 9, 2025
Homeఆంధ్రప్రదేశ్క్ష‌త‌గాత్రుల‌కు మంత్రుల ప‌రామ‌ర్శ‌

క్ష‌త‌గాత్రుల‌కు మంత్రుల ప‌రామ‌ర్శ‌

తిరుపతిలో నిన్న క్యూలైన్‌లో తొక్కిసలాట జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఏపీ మంత్రులు పరామర్శించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ , సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు హరిప్రసాద్, జాయింట్ కలెక్టర్ తో కలసి రుయా ఆసుపత్రి మార్చురి నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చివివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియా తో మంత్రులు మాట్లాడుతూ తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సి సి కెమెరా లు ఉన్నాయని వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రులు తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు