Monday, January 13, 2025
Homeతెలంగాణమాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో నిరాశ

మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో నిరాశ

ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నిరాశ ఎదురైంది. త్వరితగతిన రేపు (జనవరి 10) విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 15న పిటిషన్‌ను లిస్ట్ చేయడంతో ఆ రోజునే విచారణ చేపడతామని సీజేఐ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. తక్షణ విచారణ కుదరదని, లిస్ట్ చేసిన తేదీ కంటే ముందుగా విచారించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.కాగా, ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ (గురువారం) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సీనియర్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు