Monday, January 13, 2025
Homeఆంధ్రప్రదేశ్లండన్ కు వెళ్లేందుకు జగన్ కు సీబీఐ కోర్టు అనుమతి

లండన్ కు వెళ్లేందుకు జగన్ కు సీబీఐ కోర్టు అనుమతి

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆయన లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు లండన్ కు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ కుమార్తెలు లండన్ లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు 20 రోజుల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతించింది. మరోవైపు, నిన్న హైకోర్టులో జగన్ కు ఊరట లభించింది. జగన్ పాస్ పోర్ట్ పొందేందుకు హైకోర్టు ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితితో జగన్ కు పాస్ పోర్ట్ ఇవ్వాలని సంబంధిత అథారిటీని ఆదేశించింది. ఎన్వోసీ కోసం జగన్ వేసిన పిటిషన్ ను కొట్టేస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు