Thursday, January 30, 2025
Homeజిల్లాలువిజయనగరంఉపాధ్యాయులపై మంత్రి వ్యాఖ్యలు అనుచితం: బహుజన ఉపాధ్యాయ సంఘం

ఉపాధ్యాయులపై మంత్రి వ్యాఖ్యలు అనుచితం: బహుజన ఉపాధ్యాయ సంఘం

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రధానోపాధ్యాయుల అనుమతితో టీచర్లు సెలవు పెడితే.సోకాజు నోటీసులు జారీచేయడాన్ని విజయనగరం జిల్లా రాజాం బహుజన ఉపాధ్యాయ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి షాకాజ్ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయుల ఉద్యమాలు, పోరాటాల ద్వారా ప్రభుత్వం కల్పించిన సెలవులు నిబంధనల మేరకు పెట్టుకునే హక్కు లేదా ?…అని బి. టి .ఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడివాడ సూర్యనారాయణ, పాండ్రంకి శ్రీనివాసరావు లు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తెనాలిలో ఎన్ ఎస్ ఎస్ ఎం ఉన్నత పాఠశాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఉపాధ్యాయుల హాజరు పట్టిని పరిశీలించి మొత్తం 24 మంది ఉపాధ్యాయులకు గాను ఎనిమిది మంది అనారోగ్యం, అత్యవసర కారణాలతో నిబంధనల మేరకు సెలవులు పెడితే ప్రధానోపాధ్యాయురాలిని అందరి ముందు ఎలా అనుమతి ఇచ్చారని దబాయించడం, వీడియో తీసి వైరల్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మంత్రి నాదెండ్ల ఉపాధ్యాయులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు మంజూరు చేస్తారని, 50% మించకుండా సెలవులను వినియోగించుకునే అవకాశం ఉపాధ్యాయులకు ఉందన్నారు. నిబంధనల ప్రకారమే పాఠశాలలో సెలవులు ఇచ్చినప్పటికీ ప్రధానోపాధ్యాయురాలిపై దుర్భాషలాడుతూ

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు