గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం ₹4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్లో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జల్ జీవన్ మిషన్ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ కల అదే..తాగు నీటి సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారని.. ఈ సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని చెప్పారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమయిందని పవన్ అన్నారు. ప్రతి మనిషికి రోజుకు సగటున 55లీటర్ల పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ₹70 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.
జల్ జీవన్ మిషన్‌లో రూ.4వేల కోట్లు దుర్వినియోగం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
RELATED ARTICLES