మొంథా తూఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
విశాలాంధ్ర – రాజానగరం/సీతానగరం : ముంచుకొస్తున్న మొంథా తూఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దు అన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసిన వాతావరణ హెచ్చరికలు గమనిస్తూ ఉండాలన్నారు. పాత భవనాలు , చెట్లు, విద్యుత్ వైర్లు, స్తంబాలు, క్రింద ఉండకూడదు. పశువులు, పెంపుడు జంతువులను సురక్షితంగా ప్రాంతాల్లో ఉంచాలి. మత్స్యకారులు గోదావరి నదిలో గాని , కాలువలు, చెరువులలో వేటకు వెళ్ల కూడదు. మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసారు అత్యవసర సహాయం కోసం అధికారులను సంప్రదించవచ్చు అన్నారు. అలాగే సహాయపు సహకారాల కోసం ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ 9384999999, వ్యక్తి గత సహాయకుడు ఫోన్ నెంబర్ 9482799999 లను సంప్రదించవచ్చు అని అన్నారు. కూటమి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు బాధ్యత తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా కోరారు.


