- Advertisement -
విశాలాంధ్ర – తాళ్లపూడి : మెంతా తుఫాన్ ప్రభావం చాలా ఉధృతంగా ఉంటుందన్న కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాళ్లపూడి మండలం లో పరిస్థితులు పరిశీలించేందుకు విచ్చేసినట్లు ప్రత్యేకాధికారి డ్వామా శాఖ కు చెందిన కె.రత్నకుమారి తాళ్లపూడి మండలానికి విచ్చేసారు. అధికార యంత్రాగమ్ తో ఆమె చర్చించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. గాలులు, వర్షం ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ హెచ్చరికలను నిర్లక్షయం చేయద్దని అన్నారు. కంట్రోల్ రూమ్ కి ప్రజలు అత్యవసర సమయం లో ఫోన్ చేయవచ్చని తెలిపారు.


