Homeఆంధ్రప్రదేశ్విలియమ్స్ చేస్తున్న ప్రజాసేవ అభినందనీయం

విలియమ్స్ చేస్తున్న ప్రజాసేవ అభినందనీయం

- Advertisement -

కొవ్వూరు ఎమ్మెల్యే  ముప్పిడి వెంకటేశ్వరరావు

విశాలాంధ్ర – తాళ్లపూడి : మానవసేవయే మాధవ సేవ అనే నానుడి ని అనుసరించి కుల మత భేదాలు లేకుండా పేద మధ్య తరగతి ప్రజలను ఆదుకునే విధంగా బిషప్ గెడ్డం విలియమ్స్, ఆయన కుమారుడు మనష్వే లు  చేస్తున్న కృషి అభినందనీయమని కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బిషప్ విలియమ్స్ జన్మదిన సందర్భము గా పోచవరం లో  మౌంట్ ఓలివేస్ ప్రేయర్ మినిస్ట్రీస్, మరియు  ఎల్.ఓ.సి ఇంట్రెనేషనల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ల ఆహ్వానం మేరకు  విలియమ్స్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగం లో  ప్రభుత్వం అమలు చేసే పి4 కూడా పెద్ద మధ్య తరగతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, ఆ మాదిరిగానే విలిఎమ్స్ కూడా విద్య, వైద్యం కోసం తన సహకారం అందించటం, భవిష్యత్తులో అనేక కార్యక్రమాలకు సహకారం గా ఆయన సేవకు అందించాలని, గ్రామంలో కొంత మంది ఈయన చేసే పనులకు రాజకీయ రంగు పులిమి అడ్డు కుంటున్నారని, అభివృద్ధి కి ఆడ్డుకోవడం సరైనది కాదని, విలియమ్స్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం లో బిషప్ విలియమ్స్ మాట్లాడుతూ తనకు కుల మత భేదాలు లేవని, సహాయం కోసం ఎదురు చూసే అందరికి ఆదు కోవటమే లక్ష్యంగా దేవుని సేవలో ఉంటానని పేర్కొన్నారు. పేదలకు, వృద్ధులకు దుప్పట్లు బట్టలు పంపిణీ చేశారు. వైద్య సేవలకు ఆర్ధిక సహకారం చేశారు. ఈ కార్యక్రమానికి కోవ్వురు మున్సిపల్ మాజీ చైర్మన్ సురపనేని చిన్ని, గాస్పెల్ సింగర్ గెడ్డం మధుబాబు, గెడ్డం రాహుల్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యురాలు కె.లక్ష్మీ, రాగోలపల్లి సొసైటీ అధ్యక్షులు అనపర్తి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు