విశాలాంధ్ర- వలేటివారిపాలెం : మాలకొండలో శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయఅధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో సాగర్ బాబు తో ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఏర్పాట్లు, ఇతర అంశాలపై మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అన్నదాన సత్రం వద్ద భక్తులకు అందుతున్న భోజన సదుపాయాలను పరిశీలించి, కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో గుడ్లూరు సీఐ మంగారావు, ఎస్ ఐ మరిడి నాయుడు, పోలీస్ సిబ్బంది మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..