విశాలాంధ్ర -రాజాం (విజయనగరం జిల్లా): తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజాం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు.తుపాను ప్రభావిత మండలాల్లో విపత్తును ఎదుర్కొనేందుకు ఇప్పటికే పునరావాస శిబిరాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.అనంతరం అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. వంగర మండలం కొండచాకరాపల్లి గ్రామానికి చెందిన పారిశర్ల వెంకటరమణ (49) అనే రైతు సోమవారం పొలానికి వెళ్లి తుఫాను ప్రభావంతో విద్యుత్ తీగ తగిలి మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేసి సంతాపం తెలిపారు.రహదార్లపై చెట్లు కూలి ట్రాఫిక్ స్తంభించే అవకాశాలు ఉన్నాయని, మండల స్థాయిలో క్రేన్లను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఫైర్,పోలీసుశాఖ, రెవిన్యూ అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.నియోజకవర్గం ప్రజలకు అత్యవసర సేవలకోసం తెదేపా కార్యాలయం వాట్సాప్ నం.. 9951095888 కు సంప్రదించినట్లు అయితే వెంటనే వారికి సహాయక చర్యలు చేపడతాపని స్పష్టం చేశారు.


