పండుగలా ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ
విశాలాంధ్ర – సీతానగరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సోమవారం రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో స్వయంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా బొబ్బిల్లంక, జాలిమూడి, కాటవరం, రఘుదేవపురం, చినకొండేపూడి గ్రామాల్లో కూటమి పార్టీ నాయకులతో కలిసి పౌజ్ నూతన పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రం పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ప్రతి నెల మొదటి రోజే పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణం జరుగుతుంది అన్నారు. ఈ పెన్షన్లు పంపిణీ అంకితభావం, నిబద్ధత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యం భారతి, సొసైటీ అధ్యక్షులు మట్ట వెంకటేశ్వరరావు, కాండ్రు శేఖర్, కవల గంగాధరరావు, టీడీపి నాయకులు చిట్టూరి రంగారావు, హాసెన్న బాబు, కాండ్రు శ్రీనివాసరావు, నీటి సంఘం గ్రామ అధ్యక్షుడు కొనే శ్రీను, వైఎస్ చైర్మన్ జగపతి రాజు, జనసేన నాయకులు జీ త్రిమూర్తులు, గట్టి సత్యనారాయణ మూర్తి, మొదలగు కూటమి పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


