ప్రధాన రహదారి పై చట్టవిరుద్ధ రోడ్డుబ్లాకుల పై చర్యలు తీసుకోవాలి
అడ్వకేట్ సూరెడ్డి శివ కుమార్
విశాలాంధ్ర – సీతానగరం: సీతానగరం, రాజమహేంద్రవరం ప్రధాన రహదారి పై చట్టవిరుద్ధంగా రోడ్డుబ్లాకుల పై అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ లో వంగలపూడి గ్రామానికి చెందిన అడ్వకేట్ సూరెడ్డి శివ కుమార్ అర్జీ సమర్పించారు. అలాగే మండలంలో మండల ప్రజా పరిషత్, రెవెన్యూ కార్యాలయలలో కూడా అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా శివ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రధాన రహదారి క్రింది ప్రభుత్వ, ప్రజా ప్రయాణాల కోసం అత్యంత కీలకంగా ఉపయోగించ బడుతుంది అని అన్నారు. ఈ రహదారి పై నిత్యం పోలవరం ప్రాజెక్టు వాహనాలు, ప్రజా రవాణా, ఇసుక లారీలు, పాఠశాల బస్సులు, వ్యవసాయ సంబంధిత వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని అన్నారు. అలాంటి ఈ రహదారి పై కొంతమంది వ్యక్తులు/సంస్థలు ఈ రహదారిని చట్టవిరుద్ధంగా కింది కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. దీనిలో ప్రధానంగా వ్యక్తిగత వేడుకలు (వివాహాలు, పుట్టినరోజులు, రిటైర్‌మెంట్ ఫంక్షన్లు), రాజకీయ సమావేశాలు, ధార్మిక కార్యక్రమాలు, వ్యవసాయ దిగుబడులు నిల్వలు చేస్తూ రోడ్డు పై కర్రలు, బారికేడ్లు, రాళ్లు, ట్రాక్టర్లు, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసి పూర్తిగా రహదారి మూసివేస్తున్నారు అని అన్నారు. ఈ రహదారి పై ప్రయాణాలు ప్రమాద కారంగా మారాయి అని అనేక మార్లు వివిధ వార్త పత్రికలో కథనాలు వచ్చిన అధికారులు చర్యలు చేపట్టడం లేదు అని అన్నారు. అలాగే ఈ రోడ్డు బ్లాకుల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అని ముఖ్యంగా అంబులెన్స్, అత్యవసర వైద్య వాహనాలు నిర్బంధం లేకుండా ప్రయాణించుటకై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు


